గజపతినగరం మండలం మధుపాడ సమీపంలో శుక్రవారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కురుస్తున్న వర్షం కారణంగా బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో బస్సును పంట పొలాల నుండి బయటకు తీశారు.