గజపతినగరంలో వైద్య సిబ్బంది నిరసన

51చూసినవారు
ఇటీవల కాలంలో వైద్యులు సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వైద్యులు సిబ్బంది నిరసన తెలియజేశారు. ఐఎంఏ పిలుపుమేరకు గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్ పర్యవేక్షణలో వైద్యులుసిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టి నిరసనతెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి వైద్య సేవలు నిలిపివేశామన్నారు.

సంబంధిత పోస్ట్