మెంటాడ మండలంలోని 3 మధ్య తరహా, 11 చిన్న తరహా నీటి సంఘాల ఎన్నికలు ఈ నెల 21వ తేదీన జరగబోతున్నాయని తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. దీనికి 20వ తేదీన సంబంధిత ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారని ఎన్నికలు 21న జరుగుతాయన్నారు. నీటి సంఘాల ఎన్నికలలో పాల్గొనేవారు తప్పనిసరిగా నీటి పన్ను కట్టి ఉండాలని అన్నారు. నీటి సంఘాల ఓటర్ల జాబితా విడుదల చేశారు.