గజపతినగరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం పదో రోజు కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ జీవో నెంబర్ 115 రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లను రెగ్యులర్ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.