పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక
కొమరాడ మండలం కోటిపాం జడ్. పి. హెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేళ తాళాలతో విశ్రాంత ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయుల ఆశీర్వదాలు తీసుకున్నారు. ఆపాత మధుర క్షణాలు తలుచుకొంటూ ఎంతో ఆనందంగా గడిపారు.