కొమరాడ: వినూత్న రీతిలో నిరసన
కొమరాడ మండలంలో వినూతన రీతిలో ఖాళీప్లేట్లు పట్టుకొని, సోమవారం నడిరోడ్డుపై బైఠాయించి సీపీఐ(ఎం) నాయకులు ధర్నా చేశారు. ఆహారమైన పెట్టండి, మరమ్మతు పనులైన చేపట్టండి లేదా సాలూరు మీదగా అయినా రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు మారుతున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాలయాపన చేయడం మాని, రోడ్డుకు మరమ్మతలు చేపట్టాలని కోరారు.