మామడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సోన్ సీఐ నవీన్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే మెగా లోక్ అదాలత్ పై సిబ్బందికి పలు సూచనలు చేశారు.