విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన కురుపాం మండలంలో మొండెంఖల్లోని గౌడు వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన గౌడు బుజ్జిలు (సుధారాణి) తన స్వగ్రామమైన మొండెంఖల్ వచ్చింది. మెయిన్ బోర్డు పక్కనే ఉన్న జియో తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఆమె విద్యుత్ షాక్కు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.