ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్ గా పేరొందిన బెలారస్‌కు చెందిన ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. గుండెపోటుకు గురైన అతను, ఆపై కోమాలోకి వెళ్లి కొద్దిరోజులకు మృతి చెందినట్లు సమాచారం. తాను రోజుకు 16,500 కేలరీల ఆహారాన్ని తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా చెప్పాడు. రోజుకు ఏడు సార్లు తింటానన్నాడు. 6 అడుగులకు పైగా పొడువు ఉండే అతని బరువు దాదాపు 155 కిలోలు.