మహిళా సర్పంచ్ అనే గౌరవం లేకుండా మాట్లాడడం తగదు
మహిళా సర్పంచ్ అనే గౌరవం లేకుండా మాట్లాడడం తగదని ఎస్ కోట సర్పంచ్ సంతోషి కుమారి మండిపడ్డారు. శనివారం ఆమె మాట్లాడుతూ స్థానిక దేవి కూడలి వద్ద జనసేన పార్టీ ఫ్లెక్సీలను గడువు తీరడంతో తొలగించామని అన్నారు. కాగా సదరు పార్టీ నాయకుడు వబ్బిన సత్యనారాయణ తనకు ఫోన్ చేసి మహిళలనే గౌరవం లేకుండా పరుష పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇదే విషయాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.