దళాయిపేటలో ఏనుగులు సంచారం

1856చూసినవారు
కొమరాడ మండలం దళాయిపేట గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్టు గురువారం అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల తోటల్లో ఉంటూ చల్లబడిన తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏనుగులున్న ప్రదేశానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసారు. కూరగాయలు, ఉద్యాన పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.