‘యూటీఎస్‌’ యాప్‌ వాడేవారికి గుడ్ న్యూస్!

85చూసినవారు
‘యూటీఎస్‌’ యాప్‌ వాడేవారికి గుడ్ న్యూస్!
‘యూటీఎస్’ యాప్ వాడే వారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉన్న జియో ఫెన్సింగ్ (భౌగోళిక) పరిమితులను తొలగించింది. ఇకపై మనం యూటీఎస్ యాప్ ద్వారా దూరంతో సంబంధం లేకుండా ఏ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టికెట్‌నైనా బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్‌ కొన్న తర్వాత ఒక గంటలోగా ప్రయాణం ప్రారంభించాలి. మరోవైపు స్టేషన్ నుంచి కనీసం 5 మీటర్ల దూరంలో ఉండి బుక్ చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్