మన్యం జిల్లా జంఝావతికి జలహారతి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు నిర్వహించారు. సోమవారం ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, సలహాదారు వర్రీ శివకృష్ణ, ప్రతినిధులు తుంబలి శివాజీ, శ్రీహరి తదితరులతో కలిసి పార్వతీపురం మండలం, కొమరాడ మండలంలో గల జంఝావతి రబ్బరు డ్యాం వద్ద జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.