కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు సహకరించాలి

64చూసినవారు
కురుపాం మండల కేంద్రంలో ఎల్విన్ పేట సీఐ సత్యనారాయణ, ఎస్సై షణ్ముఖరావు ఆధ్వర్యంలో శివన్నపేట గ్రామస్థులతో శనివారం సమావేశం నిర్వహించారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆరోజు అందరూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలన్నారు. రాజకీయ తగాదాల్లో తలదూర్చి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, డీజేలు నిర్వహించడం వంటివి చేయరాదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్