విజయవాడలోని మొగల్రాజపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక బీఎస్ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏ.రమేష్.. స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడటం లేదని ఆయనను సస్పెండ్ చేశారు. దాంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్ రద్దు చేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.