చెట్టు విరిగి పడటంతో నుజ్జు నుజ్జు అయిన బైక్

3261చూసినవారు
గుమ్మలక్ష్మీపురం గ్రామంలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వీధిలో ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా విరిగి అమాంతం పడిపోయింది. ఈ ఘటనలో చెట్టు కింద ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జు అయ్యి ధ్వంసం అయ్యింది. చెట్టు పడిపోయే సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన స్థానిక సర్పంచ్ వచ్చి చెట్టును తొలిగించారు.

సంబంధిత పోస్ట్