రాష్ట్ర వైద్యశాఖ మంత్రి మన్యం జిల్లా పర్యటన వివరాలు ఇవే

72చూసినవారు
రాష్ట్ర వైద్యశాఖ మంత్రి మన్యం జిల్లా పర్యటన వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడు శుక్రవారం పార్వతిపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9. 30 గంటలకు సీతానగరం ప్రైమరీ హెల్త్ సెంటర్, మారిపివలస పిహెచ్సి ను సందర్శిస్తారు. 11. 00 గంటలకు జిల్లా ఏరియా ఆసుపత్రి కూడా సందర్శించునున్నారు. అనంతరం జిల్లా వైద్య అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 4: 30 తర్వాత విశాఖపట్నం ప్రయాణించనున్నారు.

సంబంధిత పోస్ట్