విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని నెల్లిమర్ల ఎస్సై బి గణేష్ కోరారు. మంగళవారం ఆయన సతివాడలోని జె టి ఎన్ ఎం డిగ్రీ కళాశాలలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని కోరారు. గంజాయి రవాణా, వినియోగం చట్ట రీత్యా నేరమని తెలిపారు.