పాముకాటుకి గిరిజనుడు మృతి
పాచిపెంట మండలం గొట్టూరు గిరిజన గ్రామనీకి చెందిన గిరిజన యువకుడు సేబి శ్రీను అనే వ్యక్తి పాము కాటుతో మంగళవారం మృతి చెందారు. నిద్రిస్తున్న తన కూతురిపై పాము ప్రాకడంతో ఆ పామును తన చేత్తో తీసి దూరంగా పారేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పాము అతడు కుడి చేయికి కాటు వేసింది. తనకేమీ కాలేదని నిర్లక్ష్యం వహించారని స్థానికులు తెలిపారు. మరుగైన వైద్యం కొరకు సాలూరు కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.