వర్షాలు కురుస్తున్న కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనీ మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయపార్వతి సూచించారు. పాలకొండ మండలం అన్నవరం పీహెచ్సీని ఆదివారం తనిఖీ చేశారు. అత్యవసర మందులు పీహెచ్సీలో సిద్ధంగా ఉంచాలన్నారు. పాము కాటు, కుక్కకాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మందుల లభ్యతను పరిశీలించారు. వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.