పార్వతీపురం: పురపాలక సంఘం అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే బోనెల

60చూసినవారు
మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం పురపాలక సంఘంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమావేశంలో నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యానికి, త్రాగునీరు ప్రాధాన్యత మరింత పెంచాలని లక్ష్యంగా సంబంధిత అధికారులు సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీటి సమస్యపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నీటి సమస్య లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్