సీతానగరం మండలంలోని పెద బోగిలి మేజర్ పంచాయతీ సర్పంచ్ జొన్నాడ టెర్రీజమ్మక 104 సిబ్బంది రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ.. 104 సేవలను నేరుగా ప్రభుత్వమే ప్రాథమిక వైద్య కేంద్రాల ద్వారా నిర్వహించాలని అన్నారు. ఉద్యోగుల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన పిఎఫ్ ఈఎస్ఐ వాటాను తిరిగి ఉద్యోగులకు ఏరియర్ రూపంలో చెల్లించాలని తెలిపారు.