నవధాన్యాలు సాగుతో నేల సారం

52చూసినవారు
నవధాన్యాలు సాగుతో నేల సారం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు యూనిట్ పనసభద్ర గ్రామంలో నవధాన్యాలు సాగు నేల తల్లికి బాగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులకు నవధాన్య విత్తనాలు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. యూనిట్ ఇంచార్జి ఉర్లక నాగార్జున మాట్లాడుతూ నవధాన్యాలు సాగు చేయడం వల్ల జీవవైవిధ్యం పెరిగి, భూసారం పెరుగుతుంది. అదేవిధంగా భూమిలో వానపాములు, సూక్ష్మజీవులు వృద్ధి చెంది, నేల గుల్ల బారుతుంది. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్