రాజాం పట్టణంలో మందు గుండు సామగ్రి దుకాణాలపై సోమవారం రాత్రి జీఎస్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా జాయింట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం తనిఖీలు చేపడుతున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, జిఎస్టి అధికారులు సత్యనారాయణ, శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో పన్ను ఆదాయం పెంచడానికి ఈ తనిఖీలు చేస్తున్నట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు.