
సాలూరు: ఇసుక అక్రమ నిల్వలు పట్టివేత
పాచిపెంట మండలం గురువునాయుడుపేట గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వలు చేసిన ఇసుకను స్థానిక తహశీల్దార్ డి. రవి, సిబ్బంది గురువారం సాయంత్రం పట్టుకున్నారు. తహశీల్దార్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని పాంచాలి వద్ద గల వట్టిగెడ్డ నుండి వాహనాల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేసి గురువునాయుడుపేట గ్రామ సమీపంలో ఇసుక అక్రమ నిల్వలు చేసి గురువు నాయుడుపేట నుండి రాత్రి సమయంలో విశాఖపట్నంకు తరలిస్తున్నారని తెలిపారు.