ఎస్ కోట మండలంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

69చూసినవారు
ఎస్ కోట మండలంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు
ఎస్ కోట మండలం బొడ్డవరలో పీహెచ్సీ వైద్యులు శిరీష ఆధ్వర్యంలో బుధవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు గ్రామంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్