ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తరాపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు అయిన పూడి మంగపతి మృతి చెందారు. ఆయన విశాఖపట్నంలో గల ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మరణవార్త విన్న గ్రామ ప్రజలు, గ్రామ టీడీపీ నాయకులు అయిన గాడి ప్రసాదు, మిడతాన నాయుడు, సింగంపల్లి ప్రకాష్, వామాలు, కొయ్యనా శంకర్, ఎర్ణయుడు, అప్పనాయుడు, సయ్యద్, విజయలక్ష్మి సబ్బవరపు అప్పారావు, తదితరులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుoటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తేలియజేశారు.