జామి మండలం అన్నంరాజుపేట సచివాలయంలో కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.