చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు

72చూసినవారు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేపాడ ఎస్సై బి దేవి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం సోంపురంలో ఆమె గ్రామ సందర్శన చేశారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్