ఎస్ కోట మండలం రాజీపేట గ్రామ సమీపంలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ గాయత్రీ మాత శంబల నగరిలో అఖండ దీపం ఏర్పాటు చేసేందుకు ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు కసరత్తు ప్రారంభించారు. కాగా ఈ అఖండ దీపానికి 300 కేజీల దేశీయ ఆవు నెయ్యి, 300 మీటర్ల వత్తు, 9 కేజీల కర్పూరం, 40 అడుగుల వత్తుతో దీపాన్ని వెలిగించనున్నారు. కాగా అఖండ దీపాన్ని ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తున్నట్లు సిబ్బంది బుధవారం తెలిపారు.