ఎస్ కోట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
ఎస్ కోట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎస్ కోట మండలం వెంకటరమణపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. కూటమి నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్