శృంగవరపుకోట: తగ్గించిన ఆవు పాలు ధరను తక్షణమే పెంచాలి
పాడి రైతులకు విశాఖ డైరీ చెల్లిస్తున్న ఆవు పాల ధరను తక్షణమే పెంచాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఎస్. కోటలోని సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టం చేకూర్చే నిర్ణయాన్ని విశాఖ డైరీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.