శృంగవరపుకోట: డాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పసికందు

70చూసినవారు
శృంగవరపుకోటలోని కొలపర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ నిర్లక్ష్యంతో పసికందు ప్రమాదంలో పడ్డాడు. వెంకటరమణ గ్రామానికి కంధకంట్ల రమ్యకు డెలివరీ సమయంలో డాక్టర్ శస్త్ర చికిత్స చేస్తూ బిడ్డని సైతం గాయపరిచాడు. దింతో ప్రేగులు బయటకు వచ్చాయి. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారిని హుటాహుటిన విశాఖ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్