అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని వంగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వంగర మండలం మగ్గూరు గ్రామంలో మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుండి 24 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.