మంచిర్యాల: అనుమానాస్పదంగా మహిళ దుర్మరణం

81చూసినవారు
మంచిర్యాల: అనుమానాస్పదంగా మహిళ దుర్మరణం
మంచిర్యాలలోని ఆదిత్య ఇంక్లైన్ సమీపంలో కూస లక్ష్మి (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కూరగాయలు, బియ్యం అమ్ముతూ జీవన సాగిస్తున్న లక్ష్మి గత నెల 27న కాలనీవాసులకు చివరిగా కనిపించింది. శనివారం బందువులు పెళ్లి కార్డు ఇద్దామని ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసి ఉంది. అనుమానంతో తాళం పగలగొట్టి చూసేసరికి మంచంపై అచేతన స్థితిలో పడిపోయి ఉంది. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్