కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎంలో చొరీకి శనివారం అర్ధరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మెషిన్ ను తెలియని దుండగులు ఇనుప రాడ్ తో పగులగొట్టాడు. కాగా.. అలారం ఆక్టివేట్ కావడంతో అక్కడి నుంచి దొంగల పరారయ్యారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.