విశాఖ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన బోటు గురువారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. బోటులో సుమారు పది మంది వరకు మత్స్యకారులున్నారు. అలలధాటికి బోటు ప్రమాదానికి గురవ్వగా అప్రమత్తమైన మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో ప్రాణాపాయం తప్పింది. పూర్తిగా ధ్వంసమైన ఓటు ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సుమారు రూ40లక్షలు ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.