నలుగురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
విశాఖపట్నంలో పనిచేస్తున్న నలుగురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు బుధవారం రాత్రి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ నుంచి 1995 బ్యాచ్ 4 గురుకి పదోన్నతి లభించింది. వీరిలో బి. నాగేశ్వరావు, ఎన్ హెచ్ విజయ్ ఆనంద్, కే. లక్ష్మణమూర్తి, కే. వెంకట్రావు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించారు.