సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్డీఓ సాయిరాంతో శనివారం సమావేశమయ్యారు. వారాసిగూడ లక్కీ హోటల్ బ్యాక్ సైడ్ ఓపెన్ స్థలం, మార్కండేయనగర్ పార్కు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ స్థలాలను కాపాడాలని ఆర్డీఓను కోరారు.