కుళ్లిన మాంసం విక్రయాలపై స్థానికుల ఆందోళన
విశాఖలోని హనుమంతవాక కమేళా వద్ద కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన బోటీ, తలకాయ, మటన్ విక్రయాలు జరుగుతుండడంతో స్థానికులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు కుళ్లిన మాంసాన్ని అక్కడే ధ్వంసం చేశారు.