రాంకీ యాజమాన్యం పై చర్యలు చేపట్టాలి

554చూసినవారు
పెందుర్తి పరిధిలోని తాడి గ్రామాన్ని ఆనుకొని ఫార్మాసిటీలో రోడ్డు పక్కన రాంకీ మ్యాన్ హోల్ నుండి వ్యర్ధ జలాలు పొంగి ప్రవహించి విపరీతమైన దుర్వాసన వస్తుందన్న విషయం తెలుసుకుని తాడి గోవిందు సంఘటన స్థలానికి చేరుకొని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసిటీ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను రాంకీ పైపుల ద్వారా తెచ్చి అక్కడక్కడ మ్యాన్ హోల్ నిర్మించి వాటిని సముద్రంలో కలుపుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్