విశాఖకు వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన విషయం తెలిసిందే. వాయుగుండం క్రమంగా బలపడుతూ శనివారం ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. తర్వాత బలహీనపడి ఓడిశా, ఛత్తీస్ ఘడ్ తీరం మీదుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.