కళ్ళు సినిమా విడుదలై 35 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన నటీ-నటులు, వారి కుటుంబ సభ్యులతో ఈ నెల 23న ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని నిర్వాహకుడు, రంగసాయి మీడియా వ్యవస్థాపకుడు బాదంగీర్ సాయి శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆరోజు విశాఖ పౌరగ్రంథాలయంలో కళ్లు చిత్రం ఉచిత ప్రదర్శన ఉంటుందన్నారు.