విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రీ పెయిడ్‌ ట్యాక్సీ కౌంటర్‌

58చూసినవారు
విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రీ పెయిడ్‌ ట్యాక్సీ కౌంటర్‌
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్‌ను నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి గురువారం రాత్రి ప్రారంభించారు. నగర ప్రజల నుంచి సిపి ఇచ్చిన ఫోన్ నంబరు 7995095799కు అందిన విన్నతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి వారి గమ్యం స్థానం చేరేందుకు గానూ ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు సీపీ చెప్పారు. సదరు టాక్సీ డ్రైవర్, యాజమానుల వివరాలు పూర్తి పోలీసు వెరిఫికేషన్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్