అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలము, తూతంగి పంచాయతికి చెందిన గేదెలబంధ గ్రామ ప్రాధమిక పాఠశాల నందు 22-23వ సంవత్సరం నాడు నేడు నిధులు కింద 16లక్షలు మంజూరు కాగా మొదటి విడత కింద 2. 38 లక్షల రూపాయలు అకౌంట్లో జమ కావడం జరిగింది. కొంత పనులకు ఖర్చుచేయగా 20వేల రూపాయలు సరిపోలేని కారణంగా అదేవిదంగా పనిచేసిన కూలిదారులు ఇబ్బంది పడతారని ఆలోచించి విద్యకమిటీవారికి ప్రధానోపాధ్యాయుల వారు తమ సొమ్మైనా చెల్లించి ఉండమని మరల నగదు పద్దాక ఇస్తానని తెల్పిన కారణంగా విద్యాకమిటీ చైర్మన్ తన సొంత సొమ్ము చెల్లించడం జరిగింది. కానీ ఇప్పటికి ఐదుమాసలు పూర్తి అగుచున్న డబ్బులు పడలేదు, అదేవిధంగా కమిటీ కి సొంత అవసరాలు మీదుగా డబ్బు అవసరం అయి ఉన్నది. కావున ఈ ఖర్చు పెట్టిన నగదుని ఎవరికీ అడగాలో తెలియని దుస్థితి నెలకొంది.