విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు మారుమూల గిరిజన గ్రామం గిరిజనులు తమ గ్రామానికి ఎయిర్పోర్టులు హెలికాప్టర్లు వద్దు, రహదారి సౌకర్యం కల్పించండి అంటూ గోచీలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు మాట్లాడుతూ.. అజయ్ పురానికి రహదారి తక్షణమే ఏర్పాటు చేయాలని, వి యం ఆర్ డి లో గిరిజన గ్రామాలు చేర్పులు ఖండిస్తున్నామని, ఎయిర్ పోర్టులు హెలికాప్టర్లు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు గోచీలు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శనలు వినూత్న నిరసన తెలిపారు.