రావికమతం మండలం కొమిర సచివాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మోసిన్ ను విధులు నుంచి తొలగిస్తూ జిల్లా సర్వే అదికారి రాజా జారీ చేసిన ఉత్తర్వులు రావికమతం తాసిల్దార్ కార్యా లాయానికి వచ్చాయని తాసిల్దార్ మహేశ్వరరావు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం, రైతులకు జగనన్న భూ రీ సర్వే లో సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం సస్పెండ్ చేసారని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయని ఆయన తెలిపారు.