గొడుగురాయి గ్రామ సమస్యపై కలెక్టర్ కి వినతిపత్రం

752చూసినవారు
గొడుగురాయి గ్రామ సమస్యపై కలెక్టర్ కి వినతిపత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ గొడుగురాయి గ్రామంలో రహదారి , సాగు నీరు సమస్యపై సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి వినతిపత్రం అందచేశారు. గొడుగురాయి గ్రామంలో సుమారు 32 కుటుంబలు జీవనం సాగిస్తున్నప్పటికి రహదారి సౌకర్యం లేని కారణంగా వర్షం అయితే గొడుగురాయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా గర్భిణీ స్త్రీలు ఉన్న గొడుగురాయి గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడం వలన అంబులెన్సు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అని కలెక్టర్ కి మాజీ మంత్రి మణి కుమారి వినవించారు. అలాగే గొడుగురాయి గ్రామంలో గతంలో సంవత్సరానికి రెండు పంటలు పండించే వ్యవసాయ పొలాలు ప్రస్తుతం చెరువు దెబ్బ తిన్నడం వలన సంవత్సరానికి ఒక్క పంట పండించాలి అంటేనే ఇబ్బంది పడే పరిస్థితి కి గొడుగురాయి గ్రామస్తులు ఉన్నారు అని మణి కుమారి అన్నారు. గ్రామంలో రహదారి, సాగు నీరు సమస్య పరిష్కరించి ఆదుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్