అన్నదాతలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ

999చూసినవారు
అన్నదాతలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ
గూడెం కొత్త వీధి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రింతాడ గ్రామ పంచాయితీలో రింతాడ-1,రింతాడ-2 ఆర్బికే (రైతు భరోసా కేంద్రం)లో స్థానిక సర్పంచ్ బొబ్బిలి.లక్ష్మి, కార్యదర్శి,విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్,ఉపసర్పంచ్,వార్డు సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాతలకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 90 శాతం సబ్సిడీతో వరి,రాగి,కొర్ర విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన నాణ్యత గల విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది. కావున అర్హులైన రైతులందరు వరి విత్తనాలను స్వదినియోగం చేసుకోవాలని తెలిపారు.

తదనంతరం రింతాడ-2 ఆర్బికే లో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించి అగ్రి అడ్వైజర్ బోర్డు సభ్యుల సూచనతో ఖరీఫ్ సీజన్ యొక్క విలేజ్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. భూసారాన్ని పెంపొందించేందుకు రైతులందరూ సేంద్రీయ పద్ధతిలో అలవర్చుకోవాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి (డిడిఓ),కె.సోమేష్(కార్యదర్శి), ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్1,2(విఏఏ) యస్.బేబీజ్యోష్న,ఎల్.సగీంత,వార్డు సభ్యులు యస్.జోగిపడాల్,కె.లక్ష్మణ్,టి.కాసులమ్మ,మాజీ సర్పంచ్ సాగిన నడిపిపడాల్,వైసిపి నాయకులు వెంకట్ రావు, వాలంటీర్స్,అగ్రీ అడ్వైజర్ బోర్డ్ సభ్యులుపలువురి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్