చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామంలో యాదవ్ వీధిలో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్లలోని నీరు అంతా రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ దృష్టికి ఇదివరకే తీసుకు వెళ్లడం జరిగిందని అయినా ఫలితం లేకపోయిందని స్థానికంగా ప్రజలు వాపోతున్నారు. కావున అధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకుంటారని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.